ETV Bharat / state

'కొత్తపట్నంలో హార్బర్ వద్దు.. జెట్టి నిర్మిస్తే చాలు' - కొత్త పట్నం హార్బర్ పై వార్తలు

ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ నిర్మించవద్దని గ్రామస్థులు నిరసన తెలిపారు. తమకు జెట్టి నిర్మిస్తే చాలని స్పష్టం చేశారు. హార్బర్ నిర్మాణంపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో హార్బర్ కు వ్యతిరేకంగా గళమెత్తారు. హార్బర్ నిర్మించడం వల్ల గ్రామం ఉనికి కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

locals protest aginst kothapatnam port
కొత్తపట్నం గ్రామస్థుల నిరసన
author img

By

Published : Oct 17, 2020, 8:32 PM IST

Updated : Oct 18, 2020, 5:54 PM IST

ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో గందరగోళం తలెత్తింది. సంయుక్త కలెక్టర్ బాపిరెడ్డి, ఆర్డీఓ ప్రభాకర రావు మండల కేంద్రం కొత్తపట్నంలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. కొందరు వైకాపా నేతలు, సానుభూతిపరులు సమ్మతిస్తున్నట్లు మద్దతిచ్చినా.. మెజార్టీ ప్రజలు హార్బర్​కు వ్యతిరేకంగా అభిప్రాయం తెలిపారు. హార్బర్ వల్ల ఏ మత్య్సకార గ్రామం కూడా బాగుపడింది లేదని.. తమకు జెట్టి నిర్మిస్తే చాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

హార్బర్ ప్రాముఖ్యాన్ని అధికారులు వివరిస్తుండగానే గ్రామస్థులు సభను బహిష్కరించి వెళ్లిపోయారు. తీరంలో అతి పెద్ద గ్రామమైన కొత్తపట్నంలో హార్బర్ నిర్మించడం వల్ల గ్రామం ఉనికి కోల్పోతుందని అభిప్రాయపడ్డారు. పెద్ద వ్యాపారులు, గుత్తేదారుల చేతుల్లోకి హార్బర్ వెళ్ళిపోయి మత్స్య కారులు ఇబ్బందులు పడతారని గ్రామస్థులు పేర్కొన్నారు. హార్బర్ ఆలోచన విరమించాలని డిమాండ్ చేశారు. రహదారిపైకి వచ్చి హార్బర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అధికారుల వాహనాలకు అడ్డంగా వెళ్లి ఆందోళనకు దిగారు. తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని వారంతా అభ్యర్ధించారు. ఉద్రిక్త పరిస్థితి తలెత్తే సంకేతాలు కనిపించగా... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

తితిదే నిధులతో బాండ్ల కొనుగోలుపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

Last Updated : Oct 18, 2020, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.