ప్రకాశం జిల్లా ఒంగోలు పివీఆర్ గ్రౌండ్‌లో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకోడానికి అధికారులు అనుమతిచ్చారు. దీపావళి రోజునే దుకాణాలు ప్రారంభమయ్యాయి. గత పండుగల్లో వందకు పైబడి దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారు. కానీ ఇప్పుడు కేవలం 10 దుకాణాలకు మాత్రమే అనుమతిచ్చారు.
కొవిడ్ కారణంగా..
జనం పెద్దగా రాకపోవడంతో వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతోంది. కొవిడ్ కారణంగా ప్రజలు కూడా దీపావళి పండగను నిరాడంబరంగా, బాణసంచాలు కాల్చకుండా చేసుకోడానికే ప్రాధాన్యమిస్తున్నారు. బాణసంచా కాల్చడం వల్ల వచ్చే పొగ వల్ల కాలుష్యం పెరగడమే కాకుండా, ఊపిరితిత్తులను ఇబ్బందిపెడుతుందనే ప్రచారం జరగడం వల్ల చాలా మంది పరిమితంగా బాణసంచాను కొనుగోలు చేస్తున్నారు.
వాటికే ప్రాధాన్యం..
కాలుష్య రహిత దీపావళికి ప్రాధాన్యం ఇస్తుండంతో పాటు, ధరలు కూడా బెంబేలెత్తిస్తుండటం వల్ల ప్రజలు కొనుగోలు తగ్గించారు. ఈ కారణంగా బాణసంచా దుకాణాలకు పెద్దగా జనం ఎగబడటం లేదు.
ఇవీ చూడండి : పండుగ ప్రత్యేకం.. ఈ రోజు దీపాలు ఎందుకు వెలిగిస్తామంటే.. ?