పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో వామపక్షాలు ధర్నా చేపట్టాయి. గత పది రోజులుగా పెట్రోల్ ధరలను ఇష్టానుసారం పెంచేస్తున్నారని వామపక్షనేతలు ఆరోపించారు. బడా పారిశ్రామిక వేత్తలకు కోట్ల రూపాయలు రాయితీలిచ్చి.. సామాన్య ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. పెట్రోల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. పెంచిన ధరలు తగ్గించాలంటూ పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
ఇదీ చదవండి: 'ఈ ఏడాదిలో టీ20 ప్రపంచకప్ ఉండకపోవచ్చు'