ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులను ఆదుకోవాలని కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పొగాకు బోర్డు ఛైర్మన్ రఘునాథబాబుకు లేఖ రాశారు. జిల్లాలో 27 వేల 262 మంది పొగాకు రైతులు 82.44మిలియన్ కేజీల పొగాకు పండించి ఇళ్ల వద్దే ఉంచుకున్నారని లేఖలో పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా సకాలంలో అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొనుగోలుదారులతో సంప్రదించి రైతుల వద్ద నుంచి పొగాకు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనాతో పాటు ప్రకృతి ప్రతికూలత, అకాల వర్షాల కారణంగా పొగాకు దిగుబడి తగ్గి రైతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఇబ్బందులను గుర్తించి పొగాకు బోర్డు నుంచి ఆర్ధిక సహాయాన్ని అందించాలన్నారు. బ్యాంకులతో సంప్రదించి రైతు రుణాలను రీషెడ్యూల్ చేయాలని ఎమ్మెల్యే లేఖలో కోరారు.
ఇదీచదవండి