మరో నాలుగు నెలల వరకు తాగునీటికి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పేర్కొన్నారు. చీరాల మున్సిపల్ కార్యాలయం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణతో వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే బలరాం పాల్గొన్నారు.
చీరాల పట్టణానికి సంబంధించిన సమస్యలను పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.