ప్రకాశం జిల్లా కనిగిరిలో గత నెల 9న జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి లతీఫ్ కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. లతీఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసుకు సంభందించి మొత్తం 13 మందిని అరెస్ట్ చేసినట్లు కందుకూరు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 3 ఇన్నోవా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కనిగిరికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఖాదర్కి బాధితుడు లతీఫ్కి గతంలో పాత గొడవలు ఉన్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఖాదర్ పెద్ద కుమారుడు మరికొంత మంది అనుచరులతో కలసి లతీఫ్ని కిడ్నాప్ చేసి ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. ప్రధాన నిందితుడు ఖాదర్ కుమారుడితో పాటు గుంటూరుకు చెందిన జబ్బార్ను మరొక 11 మందిని కోర్టకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ రవిచంద్ర వెల్లడించారు. ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేవలం గంటల వ్యవధిలోనే కేసు ఛేదించిన కనిగిరి ఎస్ఐని ప్రత్యేకంగా అభినందించారు.
కనిగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కేసులో 13మంది అరెస్ట్ - Kanigiri real estate dealer kidnape news
ప్రకాశం జిల్లా కనిగిరిలో గత నెల 9న జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కేసుకు సంభందించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి మూడు ఇన్నోవా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కందుకూరు డీఎస్పీ వెల్లడించారు.
ప్రకాశం జిల్లా కనిగిరిలో గత నెల 9న జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి లతీఫ్ కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. లతీఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసుకు సంభందించి మొత్తం 13 మందిని అరెస్ట్ చేసినట్లు కందుకూరు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 3 ఇన్నోవా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కనిగిరికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఖాదర్కి బాధితుడు లతీఫ్కి గతంలో పాత గొడవలు ఉన్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఖాదర్ పెద్ద కుమారుడు మరికొంత మంది అనుచరులతో కలసి లతీఫ్ని కిడ్నాప్ చేసి ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. ప్రధాన నిందితుడు ఖాదర్ కుమారుడితో పాటు గుంటూరుకు చెందిన జబ్బార్ను మరొక 11 మందిని కోర్టకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ రవిచంద్ర వెల్లడించారు. ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేవలం గంటల వ్యవధిలోనే కేసు ఛేదించిన కనిగిరి ఎస్ఐని ప్రత్యేకంగా అభినందించారు.
ఇదీ చూడండి: కనిగిరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కేసు సుఖాంతం