ఎన్నికలకు సంబంధించి ఈవోలు, ఎన్నికల అధికారులు, సహాయ సిబ్బందితో కనిగిరి నగర పంచాయతీ కమిషనర్ డీవీ నారాయణరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల ఏర్పాట్లు, వసతుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 వార్డుల్లో 33,574 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసామని చెప్పారు. వచ్చే నెల పదో తేదీన జరగబోయే నగర పంచాయతీ ఎన్నికల సమయంలో ఓటర్లకు, ఎన్నికల సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు.
ఇదీ చదవండి: జమిలి ఎన్నికలు వస్తే వైకాపా ఇంటికే: చంద్రబాబు