ఒకప్పుడు సిరులు కురిపించిన కనకాంబరం ఇప్పుడు కర్షకుల కంట నీరు తెప్పిస్తోంది... ప్రకాశం జిల్లా, దర్శి మండలం వెంకటాచలంపల్లి గ్రామ రైతులు కనకాంబరం సాగుతో కష్టాల్లో కూరుకుపోతున్నారు. పెట్టుబడి తిరిగి రాక బోరుమంటున్నారు. వెంకటాచలంపల్లి రైతులు గత పదిహేను సంవత్సరాలుగా పూల తోటల సాగుతో జీవనం సాగిస్తున్నారు... కాలానుగుణంగా కనకాంబరం, మల్లెలు, బంతి, చామంతి పంటలను సాగుచేసి కడపు నింపుకొంటున్నారు.
నాలుగేళ్లుగా వర్షాలు లేక బోర్లలో నీరులేక తోటలు వట్టి పోతున్నాయి. పూలు సరిగా వికసించక మార్కెట్లో రేట్లు పడిపోతున్నాయి. ఒకప్పుడు ఎకరాకు పది నుంచి పదిహేను కేజీల వరకు పూల దిగుబడి వచ్చేది. మార్కెట్లో కేజీ కనకాంబరం ధర 300 నుంచి 500 వరకు పలికేది. కానీ ఇప్పుడు ఎకరాకు 3 కేజీల నుంచి 5 కేజీల వరకే దిగుబడి వస్తోంది. మార్కెట్ ధర కూడా 150 నుంచి 200 రూపాయలు మాత్రమే ఉంటోంది. ప్రస్తుతం వచ్చే దిగుబడి కూలీలకు మాత్రమే సరిపోతుందని రైతులు వాపోతున్నారు. రోజూ కష్టపడి పనిచేసినా గిట్టుబాటు కావట్లేదని రైతులు బాధపడుతున్నారు.
ఇదీ చదవండి