ప్రకాశం జిల్లా చీరాలలో పాత్రికేయుడు నాయుడు నాగార్జున రెడ్డిపై సోమవారం హత్యాయత్నం జరిగింది. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుజు స్వాములు, ఆయన అనుచరులు ఇటీవల జాతీయ జెండాను అవమానపరిచారంటూ సోమవారం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. అనంతరం మరొక వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై స్వ గ్రామం వేటపాలెం వెళ్తున్న ఆయనను చినగంజాం సమీపంలో కొందరు వ్యక్తులు అటకాయించారు. ఓ అతిథి గృహంలో నిర్బంధించి విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని కొత్త పేట సమీపంలో పడవేశారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది నాగార్జున రెడ్డిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు నాగార్జున రెడ్డి గతంలో చీరాల ప్రాంతంలో ఇసుక మాఫియాపైనా, పలు అక్రమాలపైనా అధికారులకు ఫిర్యాదు చేశాడు. మాజీ ఎమ్మెల్యే అనుచరులే నాగార్జున రెడ్డిపై దాడిచేశారని వారిపై చర్యలు తీసుకోవాలని చీరాలలోని ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించాయి.
ప్రకాశం జిల్లాలో పాత్రికేయుడిపై హత్యాయత్నం - journalist nagarjuna reddy
ప్రకాశం జిల్లా చీరాలలో పాత్రికేయుడు నాయుడు నాగార్జున రెడ్డిపై సోమవారం హత్యాయత్నం కలకలం రేపుతోంది. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు స్వాములు, ఆయన అనుచరులే దాడి చేశారంటూ ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.
ప్రకాశం జిల్లా చీరాలలో పాత్రికేయుడు నాయుడు నాగార్జున రెడ్డిపై సోమవారం హత్యాయత్నం జరిగింది. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుజు స్వాములు, ఆయన అనుచరులు ఇటీవల జాతీయ జెండాను అవమానపరిచారంటూ సోమవారం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. అనంతరం మరొక వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై స్వ గ్రామం వేటపాలెం వెళ్తున్న ఆయనను చినగంజాం సమీపంలో కొందరు వ్యక్తులు అటకాయించారు. ఓ అతిథి గృహంలో నిర్బంధించి విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని కొత్త పేట సమీపంలో పడవేశారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది నాగార్జున రెడ్డిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు నాగార్జున రెడ్డి గతంలో చీరాల ప్రాంతంలో ఇసుక మాఫియాపైనా, పలు అక్రమాలపైనా అధికారులకు ఫిర్యాదు చేశాడు. మాజీ ఎమ్మెల్యే అనుచరులే నాగార్జున రెడ్డిపై దాడిచేశారని వారిపై చర్యలు తీసుకోవాలని చీరాలలోని ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించాయి.
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
Body:script
Conclusion:FTP lo vachindi
TAGGED:
journalist nagarjuna reddy