డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అద్దంకి జనసేన నేత కంచెర్ల శ్రీకృష్ణ ఆధ్వర్యంలో లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు అన్నదానం చేస్తున్నారు. కొరిసపాడు మండలం గుడిపాడు జాతీయ రహదారిపై గత 15 రోజుల నుంచి రోజు 200 మందికి భోజనం అందజేస్తున్నట్లు వివరించారు. వివిధ రాష్ట్రాల నుంచి స్వగ్రామాలకు వెళ్తున్న కార్మికులకు బాసటగా నిలుస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపుమేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు జనసైనికులు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు చర్యలు చేపట్టాలని అద్దంకి జనసేన నాయకుడు కంచర్ల శ్రీ కృష్ణ కోరారు. ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్న తెలుగువారిని స్వస్థలాలకు రప్పించాలని డిమాండ్ చేశారు.