ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను మౌలిక వనరుల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీటర్ల పరిధిలో మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం తెలిపింది. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై డీపీఆర్ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్థారిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ మారిటైమ్ బోర్డు ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపింది. రామాయపట్టణాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాన్ మేజర్ పోర్టుగా అభివృద్ధి చేయనుంది.
ఇదీ చూడండి: రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు!