ETV Bharat / state

ఓటర్ జాబితాలో కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు - బీఎల్వోల పనితీరుపై విమర్శలు - ప్రకాశం జిల్లాలో నకిలీ ఓట్లు

Irregularities in AP Voter List 2023: ఓటర్ల జాబితా పరిశీలన అంశంపై వస్తున్న విమర్శలకు సరైన సమాధానం లభించడంలేదు. ఓటర్లు జాబితాలో వరస క్రమంలో ఉండాల్సిన ఓట్లు, చిరునామా ప్రకారం ఓటరు గుర్తింపు, మార్పులు, చేర్పులు వంటి వాటిపై ఫిర్యాదులు వెళుతున్నా వాటి పరిష్కారంలో బీఎల్వోలు చొరవ చూపడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి.

Irregularities_in_AP_Voter_List_2023
Irregularities_in_AP_Voter_List_2023
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2023, 1:14 PM IST

Irregularities in AP Voter List 2023 : ఒకే కుటుంబానికి చెందిన ఓట్లను.. వరుస క్రమంలో, ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంచాలన్నది ఎన్నికల సంఘం ఆదేశం. గత నెల 27న ఇచ్చిన ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలిస్తే ఈ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. కనీసం తమ ఓటు ఎక్కడుందో స్వయంగా పరిశీలన చేసుకోవాలన్నా కష్టతరంగా మారింది. మృతుల ఓట్లే కాదు. ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓటు హక్కు ఉండడం వంటి పరిణామాలు గమనిస్తే ఇటీవల చేపట్టిన ఇంటింటి సర్వేలో బీఎల్వోలు ఏ మేరకు పరిశీలన చేపట్టారన్నది అర్థమవుతోంది. సాధారణంగా ఒకే ఇంట్లో ఉంటున్న వారి వివరాలు ఓటరు జాబితాలో వరస క్రమంలో ఒకేచోట ఉంటాయి.

NO sequence in Ongole Voters List 2023 : ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితాలో మాత్రం భార్య ఓటు ఒక చోట ఉంటే, భర్తది మరో చోట ఉంది. ఇతర కుటుంబీ కులవి మరో ప్రాంతంలో ఉన్నాయి. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలు సైతం మారాయి. దీని వల్ల ఒకరు ఓ చోటు ఓటు వేస్తే.. మరొకరు మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలోని మరో కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలి. ఈ క్రమంలో కొందరు ఆనాసక్తి చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా వయో భారంతో.. ఆరోగ్య కారణాలతో ఒంటరిగా అంతదూరం వెళ్లలేని పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి అంశాలు పోలింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలా జిల్లా వ్యాప్తంగా 67,797 కుటుంబాలకు చెందిన 1,47,948 మంది ఓట్లు ఒకే క్రమంలో కాకుండా వేరు వేరు పోలింగ్‌ కేంద్రాల్లో నమోదయివున్నాయి.

ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల ఓట్లు లక్ష్యంగా వైసీపీ అక్రమాలు- ఫేక్ ఓటరు ఐడీతో తొలగింపు

Duplicate Votes in Ongole : దాదాపు 8 వేల ఓట్లు డూప్లికేట్‌ ఓట్లు ఉన్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. పేరు, చిరునామా ఒక్కటే ఉన్న మరో రెండు వేల ఓట్లు గుర్తించారు. ప్రధానంగా జిల్లా కేంద్రం ఒంగోలులో నివసిస్తూ ఉన్న వారు చాలా మందికి అటు సొంత పల్లెల్లో, ఇటు నివాసముంటున్న పట్టణంలో కూడా ఓటు ఉంటుంది. తొలగింపుల్లో ఒక ఓటు ఉంచుకొని రెండోది తొలగించాలి. ఈ ప్రక్రియ జరగడం లేదు. మృతుల ఓట్లు గుర్తింపులో కూడా సరైన చర్యలు లేవు. ఓటరు జాబితాలో మృతుల ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి ఓట్లను తొలగించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయిలోని బీఏల్వోలు నుంచి ఉన్నతాధికారుల వరకు ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో అవకతవకలు - చర్యలు తీసుకోవలని ప్రతిపక్షాల డిమాండ్​

Double Votes in AP : ఓటుకు ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు. గత ఏడాది ఆగస్టు ఒకటో తేదీన ప్రక్రియ ప్రారంభించినా నేటికీ అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఫొటో సిమిలర్ ఎంట్రీ సాంకేతికతతో కొంతమేర బోగస్ ఓట్లు గుర్తించినా, వాటిని తొలగించే పని బిఎల్వోలు చురుగ్గా పని చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఓటర్లు సంఖ్య పెరగడం, గ్రామాలు విస్తరించడంతో కొత్త పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటు పై కూడా వినతులు వస్తున్నాయి.

Fake Votes in Prakasam District : నియోజకవర్గం సరిహద్దులో, పక్క నియోజకవర్గం ఆనుకొని వెంచర్లు, కొత్త కాలనీలు అభివృద్ధి చెందితే దానికి సమీపంలో కొత్త పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇలా వినతులు ఇస్తే అలాంటి వారిని గుర్తించి, కొత్తగా పోలింగ్‌ కేంద్రం మంజూరు చేయకుండా వారి ఓట్లను వేరు వేరు పోలింగ్‌ కేంద్రాలకు కేటాయిస్తున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కొక్క చోట పోలింగ్‌ కేంద్రాన్ని కేటాయించడం వల్ల కూడా ఓటింగ్‌పై ప్రభావం చూపుతుంది. జాబితా సవరణలు విషయంలో యంత్రాంగం చిత్తశుద్దితో వ్యవహరిస్తే ఓటర్లందరికీ న్యాయం జరగుతుంది.
హలో! ఆ రోజు ఓటు వేసి వెళ్తాం - మా ఓటు అాలాగే ఉంచండి! ఓటరు జాబితాలో కావల్సినవారివి, మృతుల పేర్లు మాత్రం కొనసాగుతాయ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.