భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘనంగా జరిగాయి. పోలీస్ పరేడ్ మైదానంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మువ్వెన్నల జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరావు, ఆదిమూలపు సురేష్, కలెక్టర్ పోలాభాస్కర్, ఎస్.పి., సిద్దార్థ కౌశిల్‌లు పాల్గొన్నారు..
జిల్లాలోని అద్దంకిలో శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ స్వాతంత్య్రం అనేది అనేక మంది నాయకుల కృషి వల్లనే సాధ్యమైందనన్నారు.
అద్దంకి లోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద అద్దంకి వైకాపా ఇంఛార్జ్ బాచిన చెంచుగరటయ్య జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొంభై ఏళ్ల పాటు నాయకులు పడిన కష్టానికి ప్రతిఫలమే..స్వాతంత్ర్యం అనిఅన్నారు.
అద్దంకిలోని హాప్ స్వచ్ఛంద సంస్థ, కోటి షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో విద్యార్థులు 70 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శకై బాపూజీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై అంటూ తమ దేశభక్తిని చాటుకున్నారు.
ఇదీచూడండి.సీఎం జగన్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోని ముఖ్యాంశాలు