ప్రకాశం జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. మోటుపల్లి పంచాయతీ కొత్తపాలెం సమీపంలో అక్రమంగా ఇసుక తవ్వుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు జరిపారు. ఇసుక నింపి ఉన్న 4 లారీలు, 2 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను చినగంజాం పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.
ఇవీ చదవండి