ETV Bharat / state

అధికార పార్టీ అండదండ ఉంటే...కొండైనా నీదే!

author img

By

Published : Jun 30, 2020, 4:36 PM IST

Updated : Jun 30, 2020, 5:34 PM IST

అధికార పార్టీ నాయకుల అండదండలుండాలే గానీ... స్థలం ఎవరిదైతే ఏముంది. గ్రావెల్ కొండ కనిపిస్తే చాలు...నేతల పేరు చెప్పు.. కొండ తవ్వేయ్. ఇదీ ప్రకాశం జిల్లాలో పరిస్థితి. అధికార పార్టీ నేతల నోటి మాట చాలు... అధికారుల అనుమతులు అవసరంలేదు. నేతల బలంతో పేదల స్థలాల్లోని కంకరను రోజుకు వందల ట్రక్కులు అక్రమంగా తవ్వుకుపోతున్నారు.

అధికార పార్టీ అండదండ ఉంటే...కొండనై నీదే!
అధికార పార్టీ అండదండ ఉంటే...కొండనై నీదే!

అధికార పార్టీ అండదండ ఉంటే...కొండైనా నీదే!

ప్రకాశం జిల్లాలో కంకర వ్యాపారానికి మంచి డిమాండ్​ ఉంది. ప్లాట్లు చదును చేయడానికి, రహదారులు, ఇళ్ల నిర్మాణానికి ముందుగా కంకరతో నింపాల్సిఉంటుంది. ప్రజావసరాలకు ఉపయోగించే కంకరను తవ్వేందుకు భూగర్భ గనుల శాఖ అనుమతులు తప్పనిసరి. అయితే లెక్కల్లో ఒకటి అర చూపి, అదనంగా తవ్వుకుపోతున్నారు. వాగులు, వంకలు, చెరువులు, రిజర్వాయర్లకు ఆనుకొని ఉన్న గుట్టల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఇళ్లస్థలాలకోసం నిర్దేశించిన ప్రాంతాలను చదును చేయడానికి కూడా పెద్ద ఎత్తున కంకర వినియోగిస్తున్నారు. ఎక్కడ వినియోగించినా ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిఉంటుంది.

  • ఆ కొండపై అధికార పార్టీ నేతల కన్ను..

ప్రకాశం జిల్లాలో అక్రమంగా కంకర తవ్వకాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని మద్దపాడు మండలం అన్నంగి, బూరేపల్లి ప్రాంతాల్లో గత ఏడాది నుంచి పెద్ద ఎత్తున తవ్వకాలు సాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన పెద్దలు కొందరు ఈ కంకర కొండపై కన్నేశారు. గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు ఆనుకుని ఉన్న బూరేపల్లి కొండల్లో తవ్వకాలు సాగిస్తున్నారు. రోజుకు వందల లోడ్లు అక్రమంగా తరలిస్తున్నారు. ట్రాక్టర్‌కు 500, టిప్పర్‌కు 2 వేల రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. రాత్రి, పగలు తవ్వకాలు సాగిస్తున్నారు.

  • తవ్వేది అక్రమంగా.. పొందేది ప్రభుత్వ బిల్లులు

ఇక్కడ నుంచి మద్దపాడు మండలంతో పాటు, ఒంగోలు పరిసర ప్రాంతాలకు కంకర తరలిస్తున్నారు. అన్నంగి కొండవద్ద ఇండ్ల స్థలాలకోసం తవ్వకాలు సాగిస్తున్నారు. ఇళ్ల స్థలాలు చదును చేయడానికి సంబంధిత నాయకులు ప్రభుత్వం నుంచి బిల్లులు వసూలు చేస్తున్నారు. బూరేపల్లి ప్రాంతంలో... గుండ్లకమ్మ నిర్వాసిత రైతులు సాగు చేసుకొనే వారు. రైతుల భూముల్లో అక్రమంగా తవ్వకాలు జరిపారు. తవ్వకాలపై రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడే కరవయ్యారు.

  • 39 హెక్టార్లకే అనుమతి.. కానీ

టంగుటూరు మండలం మర్లపాడు, కొణిజేడు, కందులూరు, కొండ పోరంబోకు భూముల్లో పెద్ద ఎత్తున ఎర్రమట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. మూడో రైల్వే లైన్‌ కోసం కొంతమంది గుత్తేదారులు చెరువుల్లో అనుమతికి మించి తవ్వకాలు సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో కేవలం 39 హెక్టార్లలో మాత్రమే అనుమతులున్నాయి. కానీ వందల హెక్టార్లలో తవ్వకాలు సాగిపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అధికారులు దృష్టిపెట్టి తవ్వకాలను నిరోధించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : ఆ ఎంపీ.. మనిషి ఒకచోట.. మనసు మరోచోట : కారుమూరి

Last Updated : Jun 30, 2020, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.