ETV Bharat / state

అనుమానంతో భార్యను చంపిన భర్త.. చిన్నపిల్లల గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసింది.. - ఏపీ నేర వార్తలు

Husband Killed His Wife: చిన్న చిన్న విషయాలకు అనాలోచితంగా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ కాలంలో మనషులు వారి సహనాన్ని సమాధి చేసుకుంటూ.. ఎదుటి వారి జీవితాలను సమాధి చేస్తున్నారు. నిర్లక్ష్యపు నిర్ణయాల వల్ల నిజాలను తెలుసుకోకుండానే కటకటాల్లోకి వెళుతున్నారు. వాళ్ల చేష్టల కారణంగా ఎదుటి వారి కుటుంబాలు అంధకారమవుతున్నాయి.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 14, 2023, 2:14 PM IST

Husband Killed His Wife : అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు. ఒకసారి అది మనసులోకి ఎక్కితే చికిత్స లేని రోగంలా మారుతుంది. ఆ అనుమానంతోనే భర్త భార్యను హత మార్చిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. మరో సంఘటనలో చిన్న పిల్లల మధ్య జరిగిన చిన్న గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి ఓ ప్రాణాన్ని బలికొన్నది. ఈ దుర్ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

అనుమానం పెనుభూతం.. భర్త చేతిలో భార్య హతం : భర్త అనుమానం పెనుభూతమై భార్య దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోటలో చోటుచేసుకుంది. రాత్రి నిద్రించే సమయంలో పథకం ప్రకారం రోకలిబండతో కొట్టి హత్య చేశాడు. మృతురాలి కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్య అనంతరం అక్కడే ఉన్న నిందితుడు శ్రీనుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యర్రగొండపాలెం మండలం యల్లారెడ్డిపల్లెకు చెందిన రెళ్ల శ్రీను మద్యానికి బానిసై నిత్యం భార్య సునీతను హింసిస్తుండడంతో నాలుగు నెలల క్రితం వేములకోటలోని పుట్టింటికి తల్లి వద్దకు వచ్చింది.

కొన్ని రోజుల తర్వాత భార్య వద్దకు వచ్చి బతిమాలుకొని ఇక నుంచి సఖ్యతగా ఉంటానని శ్రీను నమ్మబలికాడు. దీంతో అతని మాటలను నమ్మిన సునీత నమ్మడంతో అప్పుడప్పుడు వేములకోటకు వస్తూ వెళుతుండేవాడు. అర్థరాత్రి కూడా అలానే ఫుల్​గా మద్యం తాగి వచ్చి అందరూ నిద్రించిన తర్వాత ఈ దారుణానికి ఒడిగట్టాడు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ కిషోర్ కుమార్, ఎస్సై సుమన్​లు పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు

చిన్న తగాదా పెద్ద ప్రమాదం అయ్యింది : చిన్నపిల్లలు ఆడుకునే విషయంలో సోమవారం రాత్రి పెద్దల మధ్య ఏర్పడిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కొల్లిపర ఎస్సై రవీంద్రారెడ్డి కథనం మేరకు.. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం చెముడుబాడు గ్రామంలో చర్చి వద్ద చిన్న పిల్లల మధ్య వివాదం ఏర్పడింది. ఈ గొడవకు ముత్తే రవి అనే వ్యక్తి కారణమని కోరగంటి కోటేశ్వరరావు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో రవికి తీవ్ర గాాయాలు కావడంతో స్థానికులు 108 ద్వారా తెనాలి వైద్యశాలకు తరలించారు.అతని పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న కొల్లిపర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.