ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాలకు చెందిన మోహన్ రెడ్డి, నాగరాజకుమారి దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు..నాగరాజ కుమారి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో మోహన్ రెడ్డి (45) తరచుగా ఆందోళన చెందేవాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన మోహన్‌రెడ్డి రాత్రయినా ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు, బంధువులు రాత్రంతా వెతికారు. మంగళవారం వాడరేవులోని సర్వీతోటలో మోహన్ పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాాచారం అందించారు. మృతదేహాన్ని చీరాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న ఈపురుపాలెం పోలీసులు దర్యాప్తు చేసి శవపరీక్ష అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
భార్య అనారోగ్యం కారణంగా మనస్తాపంతో భర్త ఆత్మహత్య - భార్యకు అనారోగ్యం మనస్తాపంతో భర్త ఆత్మహత్య
భార్యకు అనారోగ్యం కారణంగా మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాలలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి శవపరీక్ష అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.