ETV Bharat / state

రోకలిబండతో కొట్టి.. పెట్రోల్​ పోసి తగలబెట్టి - Husband Murder by Wife at giddalur

Husband Murder by Wife at Giddalur: ప్రకాశం జిల్లా గిద్దలూరులో భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. మద్యం మత్తులో ఉన్న భర్తపై రోకలిబండతో దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించింది. అనంతరం పోలీస్ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయింది.

Husband Brutally Murder by Wife
Husband Brutally Murder by Wife
author img

By

Published : Jan 17, 2022, 12:18 PM IST

Giddalur Crime News: ప్రకాశం జిల్లా గిద్దలూరులోని శ్రీరామ్ నగర్​లో అదివారం రాత్రి దారుణం జరిగింది. ఇంటి ఇల్లాలే.. భర్తను దారుణంగా హతమార్చింది. రోకలి బండతో దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించింది. అనంతరం పోలీస్ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయింది. మద్యం తాగొచ్చి తరచూ.. వేధింపులకు గురి చేస్తుండటంతో విసిగిపోయిన తాను.. ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది.

గిద్దలూరుకు చెందిన అంకాలమ్మ.. అంజి అలియాస్ చిరంజీవికి 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. మొదట్లో బాగానే ఉన్న అంజి.. తర్వాత తరచూ మద్యం సేవించి భార్యను వేధింపులకు గురి చేసేవాడని స్థానికులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి మద్యం తాగొచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన అంకాలమ్మ.. రోకలిబండతో దాడికి చేసింది. అనంతరం తీవ్రంగా గాయపడ్డ భర్తపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. అంజి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తరువాత అంకాలమ్మ పోలీస్ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీచదవండి..

Suicide Attempt: సామాజిక మాధ్యమాల్లో భార్య అసభ్య దృశ్యాలు.. పిల్లలకు విషమిచ్చి.. తానూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.