తన నియోజకవర్గంలో శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. చీరాల మండలంలో అర్హత ఉన్నవారికి ఇళ్లస్థల పట్టాలను పంపిణీ చేశారు. నియోజక అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు బేబిరాణి, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆశ్చర్యానికి గురిచేస్తున్న వైకాపా ఫ్లెక్సీలో అధికారి ఫొటో!