మహిళల పట్ల ఆలోచనా ధోరణి మారినప్పుడే.. వారిపై అఘాయిత్యాలు ఆగుతాయని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక ఛైర్మన్ జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏర్పాటు చేసిన సదస్సును సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మహిళలపై జరిగే అకృత్యాలకు చట్టాలు, పోలీసుల ద్వారానే అడ్డుకట్ట వేయలేమన్నారు. బాలికల పెంపకంలో తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారాలని సూచించారు. లింగ వివక్ష చూపకుండా అందరినీ సమానంగా చూస్తూ.. నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలని ఉద్బోధించారు. మాట్లాడుతూ.. నేర ప్రవర్తన కలిగిన వారిని ముందే గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని గౌరవ అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ మఠం వెంకటరమణ అన్నారు. కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వి.జ్యోతిర్మయి అధ్యక్షత వహించారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు సునీతాకృష్ణన్, దిల్లీకి చెందిన బచ్‌పన్ బచావో ఆందోళన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనుంజయ్ తింగాల్, రాష్ట్ర పోలీసు డీఐజీ(టెక్నికల్) పాల్‌రాజు, కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రసంగించారు.
ఇదీ చదవండి: సెషన్స్ కోర్ట్ ప్రాంగణంలో మీడియేషన్ ఛాంబర్ ప్రారంభం