ప్రకాశం జిల్లాలో భారీ వర్షం..రైతులు హర్షం ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో జోరుగా వర్షం కురిసింది. యర్రగొండపాలెంలో పడిన వర్షానికి పట్టణంలోని రహదారులన్నీ జలమయం అయ్యాయి. వస్తాద్గారి వీధి, స్టేట్ బ్యాంక్ బజార్, చెంచుపాముల కాలనీలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. దీనితో కాలనీ వాసులు ఇబ్బందులకు గురయ్యారు. ఇదిలావుంటే ఈ వర్షం సాగుకు ఉపయోగకరంగా ఉంటుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : కృష్ణాజిల్లాలో భారీ వర్షం.. రైతుల్లో సంతోషం