ప్రకాశం జిల్లా చీరాల ఉదయం నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పట్టణంలోని రహదారులు జలమయమయ్యాయి. వేటపాలెం, చినగంజాం, పర్చూరు, అద్దంకిలోనూ ఇదే పరిస్థితి. దుకాణాదారులు షాపులు తెరవటానికి ఇబ్బంది పడ్డారు. మరోవైపు ఉదయం నుంచే వర్షం కురవటంతో పనులకు వెళ్లే కూలీలకు అంతరాయం కలిగింది. గుంతల్లో నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు.
ఇదీ చూడండి
కావాలనే కేసులు పెట్టి వేధిస్తున్నారు: ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి