ఘనంగా ప్రకాశం జిల్లా 51వ అవతరణ దినోత్సవం - ministers balineni srinivas reddy latest news update
ప్రకాశం జిల్లా 51వ అవతరణ దినోత్సవ కార్యక్రమాలను రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, సురేష్‌లు ప్రారంభించారు. ప్రకాశం హాలులో ఉన్న ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి నివాళులర్పించి, జిల్లా జెండాను ఎగురవేశారు. జిల్లా ఇంతకాలం నిర్లక్ష్యానికి గురయ్యిందని, గత పాలకులు అభివృద్ధిని పట్టించుకోకపోవడం వల్ల వెనుకబడిన జిల్లాగా మిగిలిపోయిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని మంత్రులు పేర్కొన్నారు.