ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్ క్వారీలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న ఒడిశా, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు లాక్ డౌన్ కారణంగా ఇరుక్కుపోయారు. పరిశ్రమలు మూతపడటంతో ఇబ్బంది పడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వలస కూలీలను స్వరాష్ట్రాలకు వెళ్లిపోవటానికి వెసులుబాటు కల్పించింది. అదే సమయంలో పరిశ్రమల నిర్వహణకు కూడా అనుమతించింది. ఈ క్రమంలో పరిశ్రమలు, క్వారీలు కార్యకలాపాలకు సిద్ధం చేసుకుంటున్నాయి. వీటిల్లో పనిచేసే కార్మికులు మాత్రం తాము ఇక్కడ ఉండేది లేదని... సొంత రాష్ట్రాలకు పంపించండని దరఖాస్తు చేసుకున్నారు. రెండు రోజుల క్రితం రహదారిపై ఆందోళనలు కూడా చేశారు. వీరి ఆవేదనను గుర్తించిన అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి... స్వస్థలాలకు పంపిస్తామని హామీ ఇచ్చారు. కానీ దానిని నెరవేర్చలేదు. తూతూ మంత్రంగా వైద్య పరీక్షలు నిర్వహించారు గానీ బస్సులు పెట్టడం గానీ, రైళ్లు వేయడం గానీ చేయలేదు. కనీసం వీరంతట వీరు వెళ్లడానికి కూడా అనుమతివ్వలేదు.
అధికారుల తీరుతో విసిగిపోయిన కార్మికులు చేసేది లేక కుటుంబాలతో కలిసి జిల్లా నుంచి స్వస్థలాలకు బయలు దేరారు. జాతీయ రహదారిపై పిల్లలు, మహిళలతో కాలిబాట పట్టారు.
ఇదీ చదవండి