ETV Bharat / state

"చంద్రబాబుకూ కోపం తెప్పించారుగా" - వాళ్లందరి కొవ్వు కరిగిస్తామని హెచ్చరించిన సీఎం - CHANDRABABU FIRE ON FAKE POSTS

ఆడబిడ్డలపై పోస్టులు పెట్టాలంటేనే భయపడేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం చంద్రబాబు - విచ్చలవిడితనంతో మదమెక్కిన ఆంబోతుల్లా తయారయ్యారని ఆగ్రహం

CM_Chandrababu_Naidu
CM Chandrababu on Social Media Fake Posts (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2024, 3:47 PM IST

CM Chandrababu on Social Media Fake Posts : ఆడబిడ్డలపై పోస్టులు పెట్టాలంటేనే భయపడేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. హద్దు మీరు ప్రవర్తిస్తున్న వారు ఇక ఖబడ్దార్ జాగ్రత్త అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలన్నీ అధ్యయనం చేసి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తామని అన్నారు. కొవ్వు పెరిగిన వాళ్ల కొవ్వు కరిగిస్తామని దుయ్యబట్టారు. నేరస్థులకంటే సమర్థులుగా పోలీసులు పని చేయాలని అన్నారు. ఆడబిడ్డలపై అసభ్య పోస్టులు పెట్టడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అని ఏ చట్టం చెప్తోందని సీఎం మండిపడ్డారు.

కుమార్తె కన్నీళ్లు చూసి పవన్‌ కల్యాణ్‌ బాధపడ్డారు: రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టులకు అడ్డు అదుపు లేకుండా పోతోందని దుయ్యబట్టారు. విచ్చలవిడి తనంతో మదమెక్కిన ఆంబోతుల్లా ఆడబిడ్డలపై పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ఆడబిడ్డల కన్నీటి కారకులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని నిలదీశారు. నాగరిక ప్రపంచంలో శాంతిభద్రతలు సమర్థంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. బాంబులకు భయపడని వాడిని అసెంబ్లీలో తన భార్యను అవమానించారని కన్నీరు పెట్టుకున్నానన్న సీఎం, కుమార్తె కన్నీళ్లు పెట్టుకోవటం చూసి పవన్ కల్యాణ్ బాధపడ్డారని అన్నారు.

సోషల్ మీడియాలో ఆ పోస్టులు చూసి నా బిడ్డలు కంటతడి పెట్టారు : పవన్ కల్యాణ్

వారికి వాతలు పెట్టే సమయం వచ్చింది: రాజకీయ ముసుగులో నేరస్థులు చలామణి అవుతుండటం వల్లే ఇన్ని అనర్ధాలని దుయ్యబట్టారు. అభివృద్ధిని యజ్ఞంలా చేస్తుంటే, సోషల్ మీడియా పోస్టులతో మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బరితెగిస్తున్న వారి ఆటలు కట్టడి చేసి వాతలు పెట్టే సమయం వచ్చిందని అన్నారు. నేరస్థులు ఏ ముసుగులో ఉన్నా నేరస్థులుగానే పరిగణిస్తామన్నారు. ఆడబిడ్డలపై అసభ్య పోస్టులు పెట్టే రాజకీయ పార్టీలు రాష్ట్రానికి అవసరమా అని నిలదీశారు. అలాంటి పార్టీల్లో ఉండటం అవసరమా అని ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నవారు ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

ఇలాంటి వాళ్లను వదిలిపెట్టాలా?: సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ వాడే భాష చూస్తున్నామన్న సీఎం, ఆడబిడ్డలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆంబోతులుగా మారి ప్రవర్తిస్తున్నారన్న సీఎం, తనపై, అనితపై, పవన్‌పై కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏ ఆడపిల్లను వదలకుండా అందరిపై మాట్లాడుతున్నారని, పవన్‌పైనే కాదు, ఆయన పిల్లలపై కూడా ఇష్టానుసారం మాట్లాడారని తెలిపారు. ఇలాంటి వాళ్లను వదిలిపెట్టాలా అని ప్రశ్నించారు. చర్యలు తీసుకోవాల్సిందే అని తేల్చిచెప్పారు.

కొవ్వు ఎక్కువై నేరస్థులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా గుండెపోటుతో చనిపోయారన్నారని, తాను కూడా నమ్మానని తెలిపారు. తానెప్పుడూ రాజకీయం చేయనని, తనను మోసం చేయాలనుకుంటే వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. శాంతిభద్రతలు ఉంటేనే అభివృద్ధికి సాధ్యమని చెప్పారు. మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకోమని అన్నారు.

"అతి మంచితనం చేతకానితనం కాకూడదు - అధికారుల హ్యాంగోవర్ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.