ETV Bharat / state

బడిలో భరోసా కేంద్రం... విద్యార్థినుల్లో ఆనందం - girl sick rooms in chirala latest

సాధారణంగా పిల్లలకు కాస్త నలతగా ఉంటే... తల్లిదండ్రులు వారిని పాఠశాలకు పంపరు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమంటారు. ఆ పాఠశాలలో చదివే విద్యార్థుల కన్నవారు మాత్రం... అనారోగ్యానికి ఏ మాత్రం కంగారుపడరు. ధీమాగా బడికి పంపిస్తారు. ఉపాధ్యాయులు చూసుకుంటారనే భరోసాతో ఉంటారు.

girl-sick-rooms-in-ongole-prakasam-district
author img

By

Published : Nov 20, 2019, 6:16 PM IST

బడిలో భరోసా కేంద్రం... విద్యార్థినుల్లో ఆనందం...

ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల... నాణ్యమైన విద్యకు కేంద్రంగా నిలుస్తోంది. మౌలిక సదుపాయాలు... పచ్చటి ప్రాంగణంతో ఈ సరస్వతీ నిలయం ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఉపాధ్యాయులు... చదువుతోపాటు బాలికల పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల్లా సంరక్షిస్తున్నారు. చిన్నచిన్న అరోగ్య సమస్యతో వచ్చిన విద్యార్థులను... విశ్రాంతి తీసుకునేలా ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు.

ప్రత్యేకించి నెలసరి సమయాల్లో బాలికలు ఇబ్బంది పడకుండా చూస్తున్నారు. శానిటరీ న్యాప్‌కిన్‌ వెండింగ్ మెషీన్లు అందుబాటులో ఉంచారు. వివిధ రకాల మందులు, ఔషధాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు సిక్‌ రూమ్‌లో విశ్రాంతి తీసుకోవచ్చు. అనారోగ్యం తీవ్రమైతే.. వెంటనే వైద్యులను పిలిపిస్తున్నారు. ఈ సౌకర్యంపై బాలికలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థినుల హాజరు పెంచేందుకు ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లుకు వచ్చిన ఆలోచనే ఈ సిక్‌ రూమ్. ఫలితంగా బాలికలు పాఠశాలకు సెలవు పెట్టకుండా క్రమంగా వస్తున్నారు. ఉత్తీర్ణత శాతం పెరిగింది. ప్రధానోపాధ్యాయుడి వినూత్న ఆలోచన, బాలికల పట్ల తీసుకుంటున్న శ్రద్ధపై విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

సమస్యల వలయంలో ప్రభుత్వ ఆదర్శ పాఠశాల

Intro:FILE NAME : AP_ONG_42_18_GIRLS_SIKE_ROOM_PKG_BYTS_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA (PRAKASAM)

నోట్ : స్క్రిప్ట్ విజువల్స్ ఫైల్ లో పంపించాను సర్, గమనించగలరు.

బైట్ : 1 : శారా, 9 వతరగతి విద్యార్థిని.
బైట్ : 2 : శ్రీలక్ష్మి, 10 వతరగతి విద్యార్థిని.
బైట్ : 3 : కె. శేషయ్య, విద్యార్థిని తండ్రి.
బైట్ : 4 : ఎం. జాన్సీరాణి, ఉపాధ్యాయురాలు.
బైట్ : 5 : ఎం.వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయుడు,
జిల్లాపరిషత్ బాలికలఉన్నతపాఠశాల, ఈపురుపాలెం.

Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ :748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899

Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ :748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.