ETV Bharat / state

వికలాంగులు, గర్భిణులకు ఉచితంగా ఆటో సౌకర్యం - గర్భిణులకు ఉచిత ఆటో సౌకర్యం

సమాజ్ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ బాబు ఆధ్వర్యంలో... ప్రకాశం జిల్లా చీరాలలో వికలాంగులు, గర్భిణులకు ఉచిత ఆటో సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి, పగలు తేడాలేకుండా ఏ సమయంలోనైనా తమ ఆటోను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు.

free auto service to oldage people and pregnant women in chirala
'వికలాంగులు, గర్భిణులకు ఉచిత ఆటో సౌకర్యం'
author img

By

Published : Nov 18, 2020, 6:56 PM IST

'వికలాంగులు, గర్భిణులకు ఉచిత ఆటో సౌకర్యం'

ప్రకాశం జిల్లా చీరాలలో సమాజ్ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ బాబు ఆధ్వర్యంలో వికలాంగులు, గర్భిణులకు ఉచిత ఆటో సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయానని... ఈ పరిస్థితుల్లో తమవంతు సహాయంగా ఒక ఆటో ఏర్పాటు చేశానన్నారు.

చీరాల, ఓడరేవు, కారంచేడు, వేటపాలెం, ఈపురుపాలెం గ్రామాల వికలాంగులకు, గర్భిణీ స్త్రీలు వైద్య సౌకర్యం కోసం ఉచితంగా ఆటో సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. రాత్రి, పగలు తేడాలేకుండా ఏ సమయంలోనైనా... 63092 48395కి ఫోన్ చేస్తే, వెంటనే ఆటో వచ్చి ఆసుపత్రికి తీసుకెళుతుందన్నారు. ఇది పూర్తిగా ఉచిత సౌకర్యమని, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

ఇదీ చదవండి:

'ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.