మాగుంట శ్రీనివాసులురెడ్డి.. తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన 108 ఆక్సిజన్ సీలిండర్ల ఉన్న వాహనాలను ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టరేట్ వద్ద కలెక్టర్ పోలా భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో చేయూత అందించిన మాగుంట కుటుంబానికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఒంగోలులో బ్లాక్ ఫంగస్ కేసు నమోదైనందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కొవిడ్ నుంచి బయట పడిన వారిపైనే దీని ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. త్వరలోనే ఓ నోడల్ అధికారిని నియమంచి బ్లాక్ ఫంగస్‌పై అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ ఆనవాళ్లు.. మరిన్ని కేసులు పెరిగే ప్రమాదం!