చీరాలలో ఫిట్ ఇండియా ర్యాలీలో ప్రకాశం జిల్లా మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రా రెడ్డి పాల్గొన్నారు. బాలుర ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాలతో విద్యార్థులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఫిట్ ఇండియా మూమెంట్ అనే కార్యక్రమాన్ని చేపట్టారని.. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని అన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా...జాతీయ క్రీడా దినోత్సవం