Liquor Supply Stopped in Telangana: తెలంగాణ వ్యాప్తంగా అన్ని మద్యం డిపోలలో సరఫరా నిలిచిపోయింది. వైన్ షాపులకు మద్యం సరఫరా చేసేందుకు రూపొందించిన సాప్ట్‌వేర్‌లో టెక్నికల్ సమస్యలే ఇందుకు కారణం. దీంతో సర్వర్ స్తంభించి తెలంగాణ మొత్తం మద్యం సరఫరాకి బ్రేకులు పడ్డాయి. దీంతో డిపోలకు వెళ్లిన డీలర్లు సర్వర్ సమస్యతో మద్యం తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణలో కొంతకాలంగా మద్యం సరఫరా పూర్తిగా ఆన్‌లైన్ విధానం ద్వారానే జరుగుతోంది. తద్వారా డీలర్లకు వేగంగా లిక్కర్ సరఫరా చేయడంతో పాటు డిపోల వద్ద ఎంత సరుకు ఉంది, డీలర్లు ఎంత తీసుకెళ్లారో స్పష్టంగా తెలిసేలా ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పద్ధతి అటు అధికారులకు, ఇటు డీలర్లకు ఉపయోగకరంగానే ఉంది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తడంతో డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సమస్యను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించే పనిలో అదికారులు నిమగ్నమయ్యారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని, రాత్రిలోపే సర్వర్ ప్లాబ్లమ్ సాల్వ్ అవుతుందని అధికారులు చెబుతున్నారు.
మందుబాబులకు కష్టమేనా: సర్వర్ సమస్య వల్ల ఇప్పటికిప్పుడు మద్యం సమస్య రాకపోయినా, ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం మందు బాబులకు కష్టమే. అయితే సమస్య అంతవరకు రాకుండా వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.
మందుబాబులకు గుడ్‌న్యూస్ - త్వరలో కొత్త బ్రాండ్లు, ధరల తగ్గింపు!