జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల ప్రక్రియలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పర్చూరు నియోజకవర్గంలో 95 పంచాయతీలు ఉండగా... 15 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 80 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. చీరాల నియోజకవర్గంలో వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీకి మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలింగ్ అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు.
పర్చూరు, యద్ధనపూడి, మార్టూరు, ఇంకొల్లు, చినగంజాం, కారంచేడు మండలాల పరిధిలో జరిగే ఈ ఎన్నికల కోసం.. అయిదుగురు డీఎస్పీలు, 8 సీఐలు, 28 మంది ఎస్ఐలు, 825 మంది పోలీసులు, 1,093 మంది పారా పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ కండే శ్రీనివాస్ తెలిపారు. పర్చూరు డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఎన్నికల నిర్వహణపై పోలీసులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పోలింగ్‌లో అనుసరించాల్సిన నిబంధనలపై పలు సూచనలు చేసి... ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:
విశాఖ, ఏఎంఆర్డీయే ప్రాజెక్టులపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు