Fishermens Stuckked in Sea: ప్రకాశం జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. చీరాల మండలానికి చెందిన మత్స్యకారులు ఆరు రోజుల క్రితం చేపల వేటకు సముద్రంలోకి బోటు సహాయంతో వెళ్లారు. తుఫాను కారణంగా సముద్రంలో బోటు నడపడానికి వీలు లేకుండా ఉండటంతో.. మధ్యలోనే ఉండిపోయారు. ఈ విషయాన్ని సమీప తీర ప్రాంతమైన సింగరాయకొండ మండలానికి చెందిన ఊళ్లపాలెం గ్రామస్థులకు ఫోన్ ద్వారా తెలిపారు. దీంతో గ్రామస్థులు సింగరాయకొండ మండల రెవెన్యూ అధికారులు, మెరైన్ పోలీసులకు, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు అప్రమత్తమై.. తీర ప్రాంతానికి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవీ చదవండి: