ETV Bharat / state

అర్ధరాత్రి ఘోర ప్రమాదం: రైలు నుంచి కిందపడిన డీజిల్‌ ట్యాంకర్లు - fire accident at ongole news

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద అగ్నిప్రమాదం జరిగింది. నాయుడుపాలెం, బాపూజీనగర్‌ మధ్య వంతెనను గూడ్స్‌ రైలు దాటుతుండగా..... చివరన ఉన్న డీజిల్ లోడ్‌ బోగీలు విడిపోయి వాటికి మంటలు అంటుకున్నాయి.

fire accident in train near surareddypalem in prakasam district
రైలు నుంచి కిందపడిన డీజిల్‌ ట్యాంకర్ చెలరేగిన మంటలు
author img

By

Published : Jun 25, 2020, 7:28 AM IST

Updated : Jun 25, 2020, 10:10 AM IST

రైలు నుంచి కిందపడిన డీజిల్‌ ట్యాంకర్ చెలరేగిన మంటలు

ప్రకాశంజిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డి పాలెం వద్ద అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న గూడ్స్‌ రైలు నాయుడు పాలెం-బాపూజీ నగర్‌ మధ్య వంతెన దాటుతుండగా చివరన ఉన్న డీజిల్‌ బోగీలు విడిపోయి మంటలు అంటుకున్నాయి.

ట్రాక్‌ కుంగిపోవడంతో పట్టాలు తప్పి బోగీలు వంతెనపై నుంచి కిందపడ్డాయి. ఈ ప్రమాదంలో డీజిల్‌ బోగీలు దగ్ధమవడంతోపాటు, రైల్వే ట్రాక్‌ దాదాపు 200 మీటర్ల మేర ధ్వంసమైందని అధికారులు తెలిపారు. సుమారు రూ.80లక్షల నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. విజయవాడ నుంచి రైల్వే రెస్క్యూ టీమ్ వచ్చి మరమ్మత్తులు చేపట్టారు. మధ్యాహ్నానితి పునరోద్దరణ పనులు చేపడతామని విజయవాడ ఏడీఆర్ఎం రామరాజు తెలిపారు.

ఇదీ చదవండి:

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. చీకటైపోయిన జీవితాలు

Last Updated : Jun 25, 2020, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.