ప్రకాశం జిల్లా రాచర్లలో భార్య మీద అనుమానంతో ఓ కన్నతండ్రే తన బిడ్డపై కర్కశంగా ప్రవర్తించాడు. గుమ్మల్ల చిన్న పుల్లయ్య అనే వ్యక్తి భార్యపై అనుమానంతో ఆమెపై రోకలిబండతో దాడి చేశాడు. పిల్లవాడు తనకు పుట్టలేదని... 8 నెలల కుమారుడిని విసిరేసి... అక్కడి నుంచి పరారయ్యాడు. బాలున్ని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.
గుమ్మల్ల చిన్న పుల్లయ్యకు ఇదివరకే వివాహమయ్యింది. మొదటి భార్యను గొడ్డలితో నరికి చంపిన కేసులో ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు ఆధ్వర్యంలో పోలీసు బృందం నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి: