ETV Bharat / state

ఈ-క్రాప్​లో సాంకేతిక తంటా... శనగ రైతుకు చింత

author img

By

Published : Jun 14, 2020, 8:51 PM IST

శనగ రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. దిగుబడి తగ్గి, గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పంట కొనుగోలు చేస్తున్నా సాంకేతిక కారణాలు అవరోధంగా మారాయి. మరికొద్ది రోజుల్లో కొనుగోలు కేంద్రాలు మూసివేయనున్నారనే సమాచారం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

Farmers with Market Fade
మార్కెట్​ ఫేడ్​తో రైతులకు ఇక్కట్లు

కొందరి రైతుల సాగు వివరాలను గ్రామస్థాయిలోనే వ్యవసాయ సిబ్బంది ఈ-క్రాప్‌లో నమోదు చేయడంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో రైతుల పేర్లు మార్క్‌ఫెడ్‌ యాప్‌లో కనిపించడం లేదు. జిల్లాలో 86,893 హెక్టార్లలో శనగ వేయగా, సుమారు 13 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నాఫెడ్‌ ద్వారా 16,800 మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు అనుమతి ఇవ్వగా 22,639 టన్నులు కొనుగోలు చేశారు. గతంలో ఈ-సమృద్ధి యాప్‌లో వివరాలు నమోదు చేసి కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్క్‌ఫెడ్‌ కొనుగోలుకు యాప్‌లో చేస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా జిల్లాలో 8 వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం తొలివిడత అనుమతి ఇచ్చింది. మలి విడతలో 15 వేల టన్నులకు జిల్లా అధికారులు అనుమతి కోరగా 10 వేల టన్నులకు అనుమతి లభించింది.

యద్దనపూడి మండలం అనంతవరంలో శనగ సాగు చేసిన రైతుల వివరాలను ఈ-క్రాప్‌ ఆధారంగా గ్రామ సచివాలయంలో ప్రకటించారు. గతంలో నాఫెడ్‌కు దిగుబడులు అమ్ముకున్న కొందరు ప్రస్తుతం యనమదలలోని మార్క్‌ఫెడ్‌ కేంద్రంలో విక్రయానికి వెళ్లగా వారి వివరాలు యాప్​లో కనిపించలేదు. పేర్ల నమోదుకు ప్రయత్నిస్తే దయచేసి మరోసారి ప్రయత్నించు అని వస్తోంది. దీంతో పంట అమ్ముకోలేక ఆందోళన చెందుతున్నారు.

పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం రైతు వి.వెంకటేశ్వర్లు 3.84, కొల్లావారిపాలెం రైతు పి.సుభాషిణి 3 ఎకరాల్లో శనగ సాగు చేశారు. పర్చూరు కొనుగోలు కేంద్రంలో పంట విక్రయించుకునేందుకు రాగా మార్క్‌ఫెడ్‌ యాప్‌లో ఈ-క్రాప్‌ వివరాలు కనిపించలేదు. దాంతో దిగుబడులు అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి...

చదువుకోమని తండ్రి మందలింపు... తనువు చాలించిన తనయ !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.