ETV Bharat / state

MIRCHI: మిర్చిని 'నల్లి'పేస్తోంది.. తోటలను దున్నేస్తున్న రైతులు - తోటలను దున్నేస్తున్న రైతులు

MIRCHI: గతేడాది మిర్చి పంట రైతులను నిలువునా ముంచిన నల్లతామర పురుగు ఈ ఏడాదీ విజృంభిస్తోంది. పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేక పలుచోట్ల తోటలను దున్నేస్తున్నారు. ల్లితామర ఆశించిన చేను చూడటానికి పచ్చగా ఉన్నా పూత నిలవదు. పార్విస్పైనస్‌ అని పిలిచే ఇది ఇండోనేసియా నుంచి వచ్చింది. మిర్చి తోటలనే కాకుండా కూరగాయలు, పండ్ల తోటలనూ ఆశిస్తోంది. నల్లి కారణంగానే గతేడాది రైతులు ఎకరాకు రూ.లక్షకుపైగా నష్టపోయారు. ప్రకాశం జిల్లా, కర్ణాటకలలో నల్లతామర ప్రభావం ఎక్కువగా ఉంది.

MIRCHI
MIRCHI
author img

By

Published : Jul 6, 2022, 8:26 AM IST

MIRCHI: గతేడాది మిర్చి పంట రైతులను నిలువునా ముంచిన నల్లతామర పురుగు ఈ ఏడాదీ విజృంభిస్తోంది. రాయలసీమలోని పలు ప్రాంతాలతోపాటు ప్రకాశం జిల్లా, కర్ణాటకలలో నల్లతామర ప్రభావం ఎక్కువగా ఉంది. పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేక పలుచోట్ల తోటలను దున్నేస్తున్నారు. మరోవైపు పచ్చి మిర్చి దిగుబడి తగ్గి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. 4 రోజుల్లోనే కిలోకు రూ.10 వరకు ధర పెరిగింది. ఎకరాకు రూ.50 వేలకుపైగా పెట్టుబడి పెట్టి మిర్చి సాగును ఏప్రిల్‌, మే నెలల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చేపట్టారు. ప్రస్తుతం కడప, కర్నూలు, ప్రకాశం తదితర జిల్లాల్లో కోతలు సాగుతున్నాయి. కోస్తాలో నారు దశలో ఉంది. పల్నాడు, బాపట్ల జిల్లాల్లో రక్షిత సేద్య విధానంలో కొన్నిచోట్ల, ఆరుబయట మరికొన్నిచోట్ల హైబ్రిడ్‌ విత్తనాలు నాటారు. నారు పెరుగుతోంది. నల్లితామర ఆశించిన చేను చూడటానికి పచ్చగా ఉన్నా పూత నిలవదు. పార్విస్పైనస్‌ అని పిలిచే ఇది ఇండోనేసియా నుంచి వచ్చింది. మిర్చి తోటలనే కాకుండా కూరగాయలు, పండ్ల తోటలనూ ఆశిస్తోంది. నల్లి కారణంగానే గతేడాది రైతులు ఎకరాకు రూ.లక్షకుపైగా నష్టపోయారు. కొందరు తోటలను తొలగించగా.. ఎక్కువ మంది రైతులకు ఎకరాకు 2, 3 క్వింటాళ్ల దిగుబడులే వచ్చాయి. జాతీయ స్థాయి పరిశోధన సంస్థల శాస్త్రవేత్తల బృందాలు దక్షిణాది రాష్ట్రాల్లో పరిశీలించి భారీ నష్టాన్ని గుర్తించాయి. అయినా రైతులకు పరిహారం అందలేదు.

* పచ్చి మిర్చిలో 8 కోతల వరకు దిగుబడి ఉంటుంది. గతేడాది నాలుగైదు కోతలు పూర్తయ్యాక నల్లి ఆశించింది. ఈ ఏడాది 1, 2 కోతలు కాకముందే నల్లి ప్రభావం మొదలైంది. వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల, పెండ్లిమర్రి తదితర మండలాల్లో వారం నుంచి నల్లి ప్రభావం కనిపిస్తోంది. ఐదు కోతలు పూర్తయిన తోటల్లోనూ నల్లి తీవ్రత ఉంది. గుంటూరు జిల్లాలో పలుచోట్ల నారు దశలో ఉన్న తోటలో నల్లి ప్రభావం కనిపిస్తోంది. కర్నూలు జిల్లాలోనూ ప్రభావం ఉంది. నల్లి నివారణకు రైతులు పురుగు మందులను విపరీతంగా పిచికారీ చేస్తున్నారు. గతంలో 8 రోజులకోసారి చేసే పిచికారీ.. ఇప్పుడు 4, 5 రోజులకోసారి తప్పడం లేదని, అయినా నిష్ఫలమవుతోందని వాపోతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.