ETV Bharat / state

ధాన్యం కొనుగోలు చేయమంటే కొట్టారు.. పోలీసులకు రైతు ఫిర్యాదు - ఈరోజు ప్రకాశం జిల్లా రైతు పోలీసులకు ఫిర్యాదు వార్తలు

తాను పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయమంటే కొనుగోలు కేంద్రం నిర్వహకులు తనను కొట్టారని నాగేశ్వరరెడ్డి అనే రైతు.. దర్శి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ధాన్యం కొనుగోలు చేసే దళారి శాగం అంజిరెడ్డి అనే వ్యక్తి.. మరికొందరితో కలిసి కొట్టారని పేర్కొన్నారు.

farmer complaint
ధాన్యం కొనుగోలు చేయమంటే కొట్టారని పోలీసులకు రైతు ఫిర్యాదు
author img

By

Published : May 28, 2021, 3:32 PM IST

ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన శాగం నాగేశ్వరరెడ్డి అనే రైతు.. తనకున్న పది ఎకరాలలో.. 300 క్వింటాళ్ల ధాన్యం పండించాడు. పోతాకమూరు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్ర ద్వారా తొలి విడతలో 216 క్వింటాళ్లు అమ్ముకున్నారు. మిగిలిన 84 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. నిర్వాహకులను అడిగినందుకు.. తనను కొట్టారని దర్శి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

మిగిలిన ధాన్యం కొనుగోలు చేయాలంటే ఖర్చుల కింద బస్తాకు 200 రూపాయల ఇవ్వాలని అడుగుతున్నారని ఆరోపించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినందుకు.. ధాన్యం కొనుగోలు చేసే దళారి శాగం అంజిరెడ్డి అనే వ్యక్తి.. మరికొందరితో కలిసి తనపై దాడి చేశారని పేర్కొన్నారు.

కొనుగోలు కేంద్రం నిర్వాహకునితో చరవాణి ద్వారా వివరణ కోరగా.. రైతు ధాన్యాన్ని నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు చేశామని తెలియజేశారు. ఇతరుల ధాన్యాన్ని తన పేరు మీద కొనుగోలు చేయాలని.. తమపై ఒత్తిడి చేస్తున్నాడని అధికారులు పేర్కొన్నారు. ఆ విధంగా కొనుగోలు చేయలేదనే అక్కసుతో తమపై ఆబాండాలు వేస్తున్నారన్నారు.

ఇవీ చూడండి..: చోరీ జరిగిన అరగంటలోనే దొంగను పట్టుకున్న పోలీసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.