ETV Bharat / state

చచ్చినా వదలడు... జంతు కళేబరాలతో వ్యాపారం.. - business with dead animals

అనారోగ్యంతోనో.. ఇతర కారణాలతోనో మృత్యువాత పడిన పశువులను కొనుగోలు చేసి వాటి మాంసాన్ని ఎగుమతి చేస్తున్నాడో వ్యక్తి.. ఆదాయం కోసం మూగ జీవాల కళేబరాలతో వ్యాపారం చేస్తున్నాడు.. చుట్టు పక్కలంతా దుర్వాసన వ్యాపించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామంలో ఈ వ్యవహారం జరుగుతోంది.

export of meat
మూగజీవాల కళేబరాలతో వ్యాపారం
author img

By

Published : Oct 26, 2020, 10:34 AM IST

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. చనిపోయిన మూగజీవాల కళేబరాలతో వ్యాపారం చేస్తున్నాడు. ఇందుకోసం జబ్బుచేసి లేక మరో విధంగా మృతి చెందిన జంతు కళేబరాలను కొనుగోలు చేస్తాడు. వాటిని ముక్కలుగా చేసి కొన్ని రసాయనాలతో శుద్ధి చేస్తాడు. ఆ మాంసాన్ని ఐస్ బాక్సుల్లో అమర్చి పట్టణాలకు ఎగుమతి చేస్తున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వ్యాపారం నిర్వహించే వ్యక్తి తనకున్న ఎకరా పొలంలో చిన్నపాటి రేకుల షెడ్ వేసి చుట్టూ ఏపుగా పశుగ్రాసాన్ని పెంచాడు. చనిపోయిన జంతువుల వివరాలు సేకరించి, తన అడ్డాకి తరలించి మాంసం ఎగుమతి చేస్తున్నాడని స్థానికులు అంటున్నారు. పూరిమెట్ల నుంచి మారేళ్ల వెళ్లే రహదారి పక్కనే ఈ మాంసం కేంద్రం ఉండటం వలన మిగులు వ్యర్ధాలతో దాదాపు కిలోమీటరు వరకు దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు అంటున్నారు.

చెడువాసన కారణంగా చుట్టుపక్కల ఉన్న పొలాల్లో పనులకు రావటానికి కూలీలు నిరాకరిస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ మాఫియా ఏడాది నుంచి సాగుతోందని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు అంటున్నారు. పోలీసులకు సమాచారం అందించిన వారిపై ఆ వ్యక్తి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతానని బెదిరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 2,997 కరోనా కేసులు, 21 మరణాలు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.