ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాల్లో ఆబ్కారీ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. 100 లీటర్ల నాటుసారా, ఒక ఆటో, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 1400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నలుగురిని అరెస్టు చేశారు. నాటుసారా అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇవీ చూడండి...