ETV Bharat / state

మాజీ ఎమ్మెల్యేను నాకే దిక్కు లేదు: ఉగ్ర నరసింహారెడ్డి - సమాచారం ఇవ్వడం లేదంటూ కనిగిరి ఎంపీడీవో, సూపరింటెండెంట్​లపై మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మండిపాటు

నివేశన స్థలాల కొనుగోళ్లకు సంబంధించిన వివరాల కోసం ఏడాది నుంచి తిప్పించుకుంటున్నారని కనిగిరి మాజీ ఎమ్మెల్యే, తెదేపా ఇన్​ఛార్జ్ ఉగ్ర నరసింహారెడ్డి మండిపడ్డారు. సమాచార హక్కు చట్టం కింద ఆశ్రయిస్తే తప్పించుకుని తిరుగుతున్నారంటూ.. ప్రకాశం జిల్లా కనిగిరి ఎంపీడీవో, సూపరింటెండెంట్​లను నిలదీశారు.

ex mla ugra narasimha reddy questioning mpdo
అధికారులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే
author img

By

Published : Dec 12, 2020, 4:36 PM IST

మాజీ ఎమ్మెల్యేను నాకే దిక్కు లేదు: ఉగ్ర నరసింహారెడ్డి

'మాజీ ఎమ్మెల్యేను నాకే దిక్కు లేదు, సామాన్యుడి పరిస్థితి ఏమిటి' అంటూ.. ప్రకాశం జిల్లా కనిగిరి ఎంపీడీవో, సూపరింటెండెంట్​ల​పై తెదేపా ఇన్​ఛార్జ్ ఉగ్ర నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేశన స్థలాల పేరిట అధికార పార్టీ నేతలు వసూలు చేసిన బిల్లుల వివరాల కోసం సమాచార హక్కు చట్టం కింద ఆశ్రయిస్తే.. తప్పించుకుని తిరుగుతున్నారంటూ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులను నిలదీశారు.

ఎందుకూ పనికిరాని భూములకు రేట్లు విపరీతంగా పెంచి పాలకులు దోచుకుంటుండగా.. వాటి సమాచారం కావాలని కోరితే ఏడాది నుంచి తిప్పించుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. నోటీసు ఇచ్చి ఒక్క రోజులోనే హాజరు కావాలన్నారని తెలిపారు. పనులన్నీ మానుకుని వస్తే.. సమాచారం మా దగ్గర లేదని చేతులు ఎత్తేశారని మండిపడ్డారు. ఈ విషయంలో లోకాయుక్తను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

'పోలీసుల వైఫల్యంతోనే మా గ్రామంపై దాడులు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.