ప్రకాశం జిల్లాలోని ఓ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్న ఓబులేష్ రెడ్డి.. సాగుకు సాయపడే చిన్న చిన్న పరికరాలు తయారు చేస్తున్నాడు. వ్యవసాయం అంటే అమితంగా ఇష్టపడే ఈ యువకుడు.. వ్యవసాయ పరికరాలకు రైతులు అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుందని గుర్తించాడు. ఇవి తగ్గించుకుంటే సాగు లాభసాటిగా మారుతుందనే అభిప్రాయానికి వచ్చాడు.
వ్యర్థ సామాగ్రే.. ముడి సరుకు:
సంతనూతలపాడు మండలం బోడపాలెంలో మాల్యాద్రి అనే అతని స్నేహితుడు శ్రీవరి సాగు చేస్తున్నాడు. కూలీల ఖర్చు భరించలేకపోగా.. ఈ చిన్న చిన్న పరికరాలతో కలుపు నివారణా చర్యలు చేపట్టారు. ప్రయాణ బ్యాగ్‌లకు ఉండే చక్రాలు, విరిగిన కుర్చీ కాళ్ళు, క్వారీల్లో మిగిలిపోయిన రాళ్ళు వంటి వాటితో.. వీడ్‌రోటర్లు తయారు చేశారు.
ఖర్చూ తక్కువే...
శ్రీవరి పంటలో ప్రతి వరసకూ మధ్య కొంత ఖాళీ ఉండటంతో.. నేలను కదిలించి కలపు మొక్కలు మొలవకుండా ఉంచేందుకు ఈ పరికరాన్ని వినియోగిస్తున్నారు. సామాగ్రికి ఏమాత్రం ఖర్చు కాకపోగా.. వెల్డింగ్కి కొంతమేర వెచ్చించాల్సి వచ్చింది. ఒకే మనిషి ద్వారా ఈ పరికరంతో కలుపు తీయవచ్చని.. ఖర్చు బాగా తగ్గిపోతుందని ఒబిలేష్ చెప్తున్నాడు.
వృథాగా పారేసిన సామగ్రితో ఈ పరికరాలను తయారు చేశాను. వాటితో మంచి ఫలితాలు వస్తున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివిధ యంత్రాలు కొనుగోలు చేసేందుకు బదులు అందుబాటులోని పనికిరాని వస్తువులను వినియోగిస్తే.. కూలి ఖర్చులు తగ్గుతాయని నా అభిప్రాయం. - ఓబులేష్ రెడ్డి, ఇంజినీరింగ్ విద్యార్థి
పెద్ద పనులు చేయడానికి యంత్రాలు కొనుగోలు చేసుకున్నా. చిన్న పనులకు కూలీలమీద ఆధారపడకుండా.. ఇలాంటి పరికరాలను ఉపయోగిస్తున్నాను. రైతులే స్వయంగా ఈ తరహా వస్తువులను చేసుకుంటే సాగు ఖర్చులు తగ్గుతాయి. - మాల్యాద్రి, రైతు
ఇదీ చదవండి: