Employees Agitation: తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో.. ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టినత ఆందోళన రెండోరోజూ కొనసాగింది. పీఆర్సీ, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ కు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి వెళ్లారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. 2018లో రావాల్సిన పీఆర్సీని ఇప్పటికీ అమలు చేయలేదని ఉద్యోగులు మండిపడ్డారు. ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. లేపక్షంలో జనవరి 6 వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని జేఏసీ నాయకులు తెలిపారు.
మొదటి రోజు నిరసనలు..
కర్నూలులో ఉద్యోగ సంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరనస కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకుంటే.. సమ్మె బాట పడతామని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాల్ని అణచివేయాలని చూస్తే.. ఊరుకోబోమన్నారు.
ఉద్యోగుల 71 డిమాండ్లలో ఒక్క పీఆర్సీపై మాత్రమే సీఎం జగన్ స్పందించారని.. మిగిలిన వాటి పరిస్థితి ఏంటని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు. విశాఖలో ఉద్యోగ సంఘాల నిరసనలో పాల్గొన్న ఆయన.. పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని నిలదీశారు.
ఇదీ చదవండి..
Employees Agitation: డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల ఉద్యమ బాట.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు