లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు దాతలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలోని రెడ్ జోన్ ప్రాంతమైన నవాబ్‌పేటలో రెడ్ క్రాస్ సంస్థ ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. చీరాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ జి.సుబ్బారావు ఆధ్వర్యంలో 350 కుటుంబాలకు మసీదు పెద్దలు, వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ ఆహారాన్ని అందించారు.
అరటి రైతులు నష్ట పోకుండా వారికి గిట్టుబాటు ధర కల్పిస్తూ.. పేదలకు ఉచితంగా అరటి పళ్లను పంచుతున్నారు. ప్రకాశంజిల్లా చీరాలలో మార్కెట్ కమిటీ ద్వారా 50 టన్నుల అరటి పళ్లను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు వైకాపా నాయకులు కొనుగోలు చేశారు. పట్టణంలోని వార్డుల్లో అరటి పళ్లను పంచారు. మునిసిపల్ కమిషనర్ కె. రామచంద్రరెడ్డి, చీరాల నియోజకవర్గ వైకాపా బాధ్యుడు ఆమంచి కృష్ణ మోహన్, సీఐ నాగమల్లీశ్వరరావు పాల్గొన్నారు.
అద్దంకి సుందరయ్య భవన్లో సీపీఎం అధ్యర్యంలో సోవియట్ రష్యా విప్లవ సారధి లెనిన్ 150 వ జయంతి వేడుకలు నిర్వహించారు. చిత్రపటానికి నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. పేదలకు నిత్యవసర సరకులు అందజేశారు. సీఐటీయూ నాయకులు సీహెచ్.గంగయ్య, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో పేదలు పనుల్లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వారికి అండగా దాతలు ముందుకు వచ్చి సాయం అందిస్తున్నారు. యర్రగొండపాలెంలోని వెంకట సురేష్ అనే వ్యక్తి అర్చకులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: