ఒంగోలు జీజీహెచ్ కోవిడ్ ఆసుపత్రిలో ఇద్దరు గుత్తేదారుల మధ్య ఘర్షణ నెలకొంది. జీజీహెచ్ కోవిడ్ కేంద్రంగా ఐదు నెలలు నుంచి కరోనా బాధితులకు సేవలందిస్తోంది. కొన్ని వార్డుల్లో సాధారణ రోగులకు కూడా ..సేవలందిస్తున్నారు. వీరికి భోజనాలు అందించేందుకు గుత్తేదారులన్నారు. సాధారణ రోగులకు రూ. 40, గర్భిణీలు రూ. 100 చొప్పున మెను చార్జీలు ఉంటాయి. కోవిడ్ బాధితులకు మాత్రం పౌష్టికాహారం అందించే విధంగా రోజుకు 350 రూపాయలు చొప్పున చెల్లిస్తున్నారు. సాధారణ రోగులకు భోజనాలు అందిస్తుస్తున్న పాత గుత్తేదారుడు ఆసుపత్రి వెనుక ఉన్న వంటగదిని ఎప్పటి నుంచో వినియోగిస్తున్నారు. కోవిడ్ భోజనాలు అందించే గుత్తేదారుడు తన వంట కోసం పాత కాంట్రాక్టర్‌ను బయటకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి గుత్తేదారుల వద్ద పనిచేసే కార్మికులు గొడవ పడటం, దాడులు చేసుకుంటున్నారు. కొత్త గుత్తేదారుడు అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పాటు, ఆసుపత్రిలో కొంతమంది అధికారులు ఈ వ్యక్తికి మద్దతుగా ఉన్నారు. పాత గుత్తేదారుడిని ఏదో విధంగా బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అతని సిబ్బంది దాడులు చేస్తున్నారని.. చంపుతామని బెదిరిస్తున్నారని పాత గుత్తేదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదని అతను తెలిపాడు. ఆసుపత్రి ఆవరణలో జరిగే గొడవకాబట్టి.. అధికారులు నుంచి వస్తే ఫిర్యాదు తీసుకుంటామని అన్నారని పాత గుత్తేదారు ఆవేదన వ్యక్తం చేశాడు. వీరిద్దరి మధ్య గొడవ వల్ల రోజు వచ్చే మెనూ సక్రమంగా అమలు జరగటం లేదని కరోనా బాధితులు వాపోతున్నారు. ప్రతీరోజు ఆలస్యంగా అల్పాహారం, భోజనం తీసుకు వస్తున్నారని, నాణ్యత, పరిమాణం కూడా ఉండటం లేదని వారు తెలిపారు..జిల్లా అధికారులు ఈ వ్యవహారంలో కలుగజేసుకోవాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి. పబ్జీ ఆడేందుకు ఫోన్ ఇవ్వలేదని బ్లేడ్‌తో గొంతు కోసుకున్న బాలుడు