ETV Bharat / state

భావితరాల కోసం విలువైన గ్రంధాలు డిజిటలైజేషన్​

author img

By

Published : Apr 9, 2021, 7:56 PM IST

స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతం ముఖ్యపాత్ర పోషించింది. వేటపాలెం సారస్వత నికేతన్ గ్రంథాలయ నూతన భవనానికి 18-04-1929న మహాత్మా గాంధీ శంకుస్థాపన చేసారు. పురాతన కాలం నాటి తాళపత్ర గ్రంధాలు, విలువైన గ్రంధాలు అప్పటినుండి ఇప్పటివరకూ ఉన్న దినపత్రికలు నేటికీ భద్రంగా ఉన్నాయి. వాటిని ముందుతరాలవారికి వారసత్వ సంపదగా అందించేందుకు డిజిటలైజేషన్ చేస్తున్నారు.

digitization of old books
వేటపాలెం గ్రంథాలయంలోని విలువైన గ్రంధాలు డిజిటైజేషన్​

వందేళ్ల చరిత్ర కలిగిన ప్రకాశంజిల్లా వేటపాలెంలో 1929లో మహాత్మా గాంధీ శంకుస్థాపన చేసిన సారస్వత నికేతన్ గ్రంధాలయంలో ఉన్న పురాతన తాళపత్ర గ్రంథాలయంతో పాటు అమూల్యమైన పుస్తక సంపదను భావితరాలకు అందించే ఉద్ధేశ్యంతో వాటిని డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కొత్తపేటకు చెందిన సనాతన జీవన ట్రస్ట్ ఇందుకోసం ముందుకొచ్చింది.

జ్యోతిష్య, నవగ్రహ, వేదాంతం, శృంగార నైషధం, దేవీ మహాత్యం, కన్యకాపురాణం, రామాయణం, మహాభారతం వంటి నలభై గ్రంధాల్లోని నాలుగువేల పత్రాలను.. ఫ్రాన్స్ నుండి తెప్పించిన అధునాతన స్కానర్ ద్వారా డిజిటలైజేషన్ చేస్తున్నారు. ట్రస్ట్ వ్యవస్థాపకుడు, ప్రముఖ నాడీ వైద్యుడి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

అపూర్వమైన గ్రంధాలను ఇప్పటివరకు భద్రపరచి ఉంచటం అభినందనీయమని డాక్టర్ శశిధర్ అన్నారు. ఈ సంపదను డిజిటలైజేషన్ చేయటంతో పాటు.. అందరికీ అర్థమయ్యేలా వాడుక భాషలోకి అనువదించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే గ్రంథాలయ యాజమాన్యం సహకారంతో అంతర్జాలంలోనూ ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. పరిశీలనలో చీరాల ఇంజినీరింగ్ కళాశాల సీఈవో వలివేటి మురళీకృష్ణ, గ్రంథాలయ ఇన్ ఛార్జీ అధ్యక్షులు కె.ఎస్. ప్రసాద్, ట్రస్ట్ సభ్యుడు కబీర్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ప్రధానితో మాట్లాడిన ప్రకాశం జిల్లా పల్లవి.. మంత్రి సురేశ్ గిఫ్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.