ETV Bharat / state

వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​కు ఫిర్యాదు - ప్రకాశం జిల్లాలో ఓడిన అభ్యర్థుల ఫిర్యాదు

పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు ఓటు వేయాలని బెదిరించిన వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని... ఓడిన సర్పంచి, వార్డు అభ్యర్థులు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. స్పందిచిన కలెక్టర్.. స్థానిక తహసీల్దార్​ను విచారణ అధికారిగా నియమించారు. విచారణ నిమిత్తం కార్యాలయానికి వాలంటీర్లు, ఫిర్యాదుదారులు రావడంతో వారిని వైకాపా నాయకులు అడ్డుకున్నారు. అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

Complaint to the prakasam Collector
కలెక్టర్​కు ఓడిన అభ్యర్థుల ఫిర్యాదు
author img

By

Published : Feb 27, 2021, 10:01 PM IST

పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు ఓటు వేయకుంటే ప్రభుత్వ పథకాలను నిలిపి వేస్తామనీ కొందరు వాలంటీర్లు ఓటర్లను బెదిరించారని ఆరోపిస్తూ.. ప్రకాశం జిల్లా పామూరు మండలంలో ఓడిన సర్పంచి, వార్డు అభ్యర్థులు జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ విచారణ అధికారిగా స్థానిక తహసీల్దార్​ను నియమించారు.

విచారణకు రాకుండా అడ్డగింత..

విచారణ నిమిత్తం ఫిర్యాదు చేసిన వారిని, వాలంటీర్లను తహసీల్దారు కార్యాలయానికి రావాలని ఆదేశించారు. వాలంటీర్లు, ఫిర్యాదుదారులు, తెదేపా నాయకులు తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. అంతలోనే కొందరు వైకాపా నాయకులు అక్కడికి చేరుకొని వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

రెండు వర్గాల మధ్య తోపులాటతో ఘర్షణ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు తహసీల్దారు కార్యాలయానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం విచారణకు సంబంధించిన వారినే లోపలికి అనుమతివ్వడంతో వివాదం సద్దుమణిగింది.

ఇదీ చదవండి:

ప్రకాశం జిల్లా పుర పోరు.. వ్యూహాలు.. బుజ్జగింపులు.. ఎత్తులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.