ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద నీటి ఉద్ధృతి తగ్గుతోంది. ఎగువన శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్, పులిచింతల నుంచి వస్తున్న ప్రవాహాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రకాశం బ్యారేజికి ప్రస్తుతం ఇది 5 లక్షల 77 వేల క్యూసెక్కులుగా నీరు చేరుతోందని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు.
70 గేట్లను ఎత్తి .. దిగువకు 6 లక్షల 81 వేల 861 క్యూసెక్కులు వదిలారు. మరో 12 వేల క్యూసెక్కుల నీటిని ఏలూరు, బందరు, రైవస్ కాలువలకు విడుదల చేస్తున్నారు. కొండవీటి వాగు ఉద్ధృతి కారణంగా గుంటూరు ఛానల్ కు పరిమిత స్థాయిలోనే నీటిని వదులుతున్నట్టు జలవనరుల శాఖ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: