ETV Bharat / state

Covid: పాఠశాలల్లో కరోనా కలకలం..వైరస్ బారిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

పాఠశాలల పునఃప్రారంభమయ్యాక విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్ బారిన పడుతుండటం ఆందోళనలకు గురిచేస్తోంది. తాజాగా.. ప్రకాశం జిల్లాలో 14 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. అక్టోబరులో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని.., చిన్నపిల్లలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో పాఠశాలల్లో కరోనా కేసుల విజృంభణ తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులను కలవరపెడుతోంది.

covid cases in schools
covid cases in schools
author img

By

Published : Aug 26, 2021, 10:03 AM IST

Updated : Aug 26, 2021, 3:43 PM IST

ప్రకాశం జిల్లాలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు కొవిడ్ బారిన పడటం కలవరపాటుకు గురిచేస్తోంది. ఒంగోలు పట్టణంలో డీఆర్​ఆర్​ఎం ఉన్నత పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు, ఐదుగురు విద్యార్థులకు వైరస్ నిర్ధరణ అయింది. పీవీఆర్ బాలికల పాఠశాలలో నలుగురు విద్యార్థులు, రాంనగర్ ప్రాథమిక పాఠశాలలో మరో విద్యార్థికి కరోనా సోకింది. ఉలవపాడు మండలం వీరేపల్లి పాఠశాలలో నలుగురు విద్యార్థులకు, దర్శి మండలం నిమ్మరెడ్డిపాలెంలో ఓ ఉపాధ్యాయరాలికి కరోనా పాజిటివ్​గా తేలింది.

తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు ప్రాథమిక పాఠశాలలోనూ ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. ఈ నెల 21న 30 మంది విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించగా.. 4,5 తరగతులు చదువుతున్న ఇద్దరు విద్యార్ధులకు కరోనా వైరస్ సోకింది. అప్రమత్తమైన అధికారులు పాఠశాలలోని మిగతా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించటంతో పాటు పాఠశాల ఆవరణ, తరగతి గదులను శానిటైజ్ చేశారు.

కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం ఆగిన పర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక విద్యార్థినికి కరోనా పాజిటివ్ గా గుర్తించారు. ఈ విషయాన్ని కపిలేశ్వరపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి తెలిపారు. పాఠశాలలో విద్యార్థిని కూర్చున్న తరగతి పిల్లలను ఇళ్లకు పంపించి.. పాఠశాలను శానిటైజ్ చేయించినట్లు ప్రధానోపాధ్యాయిని తెలిపారు.

ఆందోళనలో సహ విద్యార్థులు, సహ ఉపాధ్యాయులు

పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు వైరస్ బారిన పడుతుండటంతో సహా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. కరోనా కేసులు గుర్తించిన పాఠశాలల్లో వైద్యాధికారులు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా పరీక్షా ఫలితాలు వచ్చేవరకు జాగ్రత్తలు వహించాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు.

పెరుగుతున్న కేసులు..

ఈనెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి పాఠశాలల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నారు. నాలుగు రోజుల క్రితం కృష్ణా జిల్లా పెద్దపాలపర్రు పాఠశాలలో 13 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. బుధవారం విజయనగరం జిల్లాలో మరో 17 మంది విద్యార్థులకు కరోనా సోకింది. అక్టోబరులో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని..,చిన్నపిల్లలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో పాఠశాలల్లో కరోనా కేసుల విజృంభణ తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులను కలవరపెడుతోంది.

ఆలోచనలో తల్లిదండ్రులు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. పాఠశాలల్లో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా..విద్యార్థులు వైరస్ బారిన పడటం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువులకన్నా..వారి ఆరోగ్యమే ముఖ్యమనే భావన తల్లిదండ్రుల్లో నెలకొంది. దీంతో పిల్లలను పాఠశాలలకు పంపే విషయంలో తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు.

ఇదీ చదవండి

Covid: విద్యార్థులపై కొవిడ్ పంజా.. నిపుణుల అంచనాలు నిజమవుతున్నాయా ?

Last Updated : Aug 26, 2021, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.