రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు పాఠశాలల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రకాశం జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభమైనప్పటి(ఆగస్టు 16) నుంచి ఇప్పటివరకు 28 మంది విద్యార్థులు, 48 మంది ఉపాధ్యాయులు కొవిడ్ బారిన పడ్డారు.
శుక్రవారం ఒంగోలు ప్రకాశం భవన్‌లో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ నిర్వహించిన సమీక్షలో జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు ఈ విషయం వెల్లడించారు. పాఠశాలల్లో కొవిడ్ ప్రొటోకాల్‌ను పక్కాగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. కేసులు నమోదైన పాఠశాలలను విద్యాశాఖాధికారులు సందర్శించి వివరాలు టాస్క్‌ఫోర్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలన్నారు.