లాక్డౌన్ కారణంగా గత మూడు నెలలుగా విద్యా సంస్థలు తెరుచుకోక పోవడం ప్రైవేట్ ఉపాధ్యాయులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రైవేట్ ఉపాధ్యాయులు భిక్షాటన తెలిపారు. తాము ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా తమను ఆదుకోవడం లేదని, పాఠశాలలు తెరుచుకోక విద్యార్థులు ఫీజులు చెల్లించలేదన్నారు. దీంతో ప్రైవేట్ కళాశాల, పాఠశాలల్లో తమకు జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వివిధ వృత్తుల వారికి ఆర్ధిక సహాయం చేస్తున్నట్లు, తమకు కూడా ఆర్ధిక సాయం అందించాలని వారు వేడుకొన్నారు.
ఇవీ చూడండి.. : విద్యుత్ షాక్ సర్క్యూట్ తో వరి గడ్డివాములు దగ్ధం